ఆ ప్రాంతంలో "దసరా" మూవీ ఈరోజే..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం అంటే సుందరానికి అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మలయాళ ముద్దు గుమ్మ నజ్రియా ... నాని సరసన హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో మెప్పించింది. అంటే సుందరానికి మూవీ తర్వాత నాని "దసరా" అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.
 

కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో ఈ మూవీ ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించాడు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ మ్యూజిక్ డైరెక్టర్ అందించిన పాటలలో నుంచి ఈ చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా ... వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.  ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని "యూఎస్ఏ" లో ఈ రోజు నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకుల నుండి కూడా ఈ మూవీ ప్రీమియర్ షో లకి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: