యాష్ కొత్త మూవీ ప్రకటన ఆ తేదీనే..?

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న యాష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందినటువంటి కే జీ ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ ల భారీ విజయాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లు విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటి వరకు తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన యాష్ చేయలేదు. మధ్యలో కన్నడ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి నర్తన్ దర్శకత్వంలో యాష్ హీరోగా ఒక మూవీ రూపొందిపోతుంది అని వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతుంది అని ఒక వార్త వైరల్ అయింది.

కానీ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలబడలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... యాష్ తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 14 వ తేదీన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే రోజున ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: