"దసరా" మూవీకి అన్నిచోట్ల నుండి అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న నాని తాజాగా దసరా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని రేపు అనగా మార్చి 30 వ తేదీన వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాని ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 2710 థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో నాని సరసన రెండవ సారి హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో నేను లోకల్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. కమర్షియల్ కథతో రూపొందిన ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

దసరా మూవీ ని దర్శకుడు సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు. నాని ఈ మూవీ లో అదిరిపోయే ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అలాగే కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో డి గ్లామరైసేడ్ రోల్ లో కనిపించబోతుంది.  ఈ మూవీ లో నాచురల్ స్టార్ నాని ఊర మాస్ లుక్ లో కనిపించనుండడం ...  కీర్తి సురేష్ డి గ్లామరైసేడ్ రోల్ లో కనిపించనుండడం తో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే 1 వ రోజు ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు  ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: