నాని "దసరా" మూవీకి అన్నిచోట్ల నుండి అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని రేపు అనగా మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 2710 థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో నేను లోకల్ అనే మూవీ రూపొందింది.

ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ మూవీ. ఇది ఇలా ఉంటే దసరా సినిమాను దర్శకుడు సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు. నాని ఈ మూవీ లో ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అలాగే కీర్తి సురేష్ కూడా ఈ మూవీ లో డి గ్లామరైసేడ్ పాత్రలో కనిపించబోతుంది. ఇలా ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించనుండడం ...  కీర్తి సురేష్ డి గ్లామరైసేడ్ పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే మొదటి రోజు ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: