ఆ స్టార్ హీరోను సొంత అభిమానులే విమర్శిస్తున్నారా...?

murali krishna
వెంకటేష్ చేసిన సినిమాలు ఎంత క్లాస్ గా ఉంటాయంటే జనాలందరూ కూడా ఎంతో ఇష్టపడుతూ సినిమా చూస్తుంటారు.
అలాంటి వెంకటేష్ తన అన్న కొడుకు అయిన దగ్గుబాటి రానా తో కలిసి చేసిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ఎన్నో విమర్శలని ఎదురుకుంటుంది. ముఖ్యంగా ఈ పాత్ర చేసినందుకు వెంకటేష్ ని చాలా మంది విమర్శిస్తున్నారటా., ఒకప్పుడు వెంకటేష్ సినిమా అంటే చాలు ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి కూర్చుని సినిమా చూసేవాళ్ళు కానీ ఇప్పుడు వెంకటేష్ రానా నాయుడు సిరీస్ చూస్తున్నాం అంటే చాలు మీకు బుద్ది లేదా అంటూ తిట్లు తిడుతున్నారనే చెప్పవచ్చు...
ఇక రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రీ కొడులుగా పరస్పర విరుద్ద మైన పాత్రలలో కనిపించారు. ఇక విక్టరీ వెంకటేష్ తొలిసారి ఒక వెబ్ సిరీస్ లో నటించాడు.రానా దగ్గుపాటి తో వెంకటేష్ డిజిటల్ అరంగేట్రం చేసిన రానా నాయుడు మార్చి 10వ తేదీన ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యిందటా.అయితే ఈ సిరీస్ లో వెంకటేష్ పచ్చి బూతులు మాట్లాడుతూ నటించడం ఎవ్వరికి అంతగా నచ్చలేదు.అందుకే విదులైన రోజు నుంచే దీని పై విమర్శలు చేస్తునే ఉన్నారు. అలాగే ఆ విమర్శల వేడి రోజు రోజుకు బాగా పెరుగుతూనే ఉంది. ఇక ఈ వెబ్ సిరీస్ విడుదలై న తరువాత ఓటీటీని సైతం సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలనే వాదన కూడా తెరపైకి వచ్చింది.వెబ్ సిరీస్పై నిషేధం విధించాలంటూ మహిళలతో పాటు సినీ ప్రముఖులు కూడా బాగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇందులో నటించిన ప్రియా బెనర్జీ  మొదటగా 2013లో అడివి శేష్ తో కలిసి కిస్ సినిమాలో నటించిందటా.. ఆ తరువాత సందీప్ కిషన్తో జోరు అలాగే నారా రోహిత్తో అసుర లాంటి తెలుగు సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో జబ్బా సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో పలు సినిమాలు , వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించిన ప్రియా తమిళంలో కూడా నటించింది. అయితే, ఈ సినిమాల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక ఆమె నటించిన తెలుగు సినిమాలు పదేళ్లు దాటడంతో ప్రియా బెనర్జీ ఎవరికీ కూడా అంతగా గుర్తులేదు. తాజాగా విడుదలైన రానా నాయుడులో ఆమె నటన చూసి ఆమె ఏమి మారలేదని పదేళ్ల కిందట కనిపించిన లుక్ లోనే ఉందని ప్రేక్షకులు అంటున్నారటా.దింతో ఈమె కి తెలుగు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: