అల్లు స్నేహా ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా...?

murali krishna
సెలబ్రిటీలు ఎక్కువగా ఫిట్‌నెస్‌ ప్రాధాన్యత ఇస్తారు చాలా మంది  అంటుంటారు.అయితే ప్రస్తుతం కేవలం స్క్రీన్‌ పై కనిపించే వారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఫిట్‌నెస్‌ పై దృష్టి సారిస్తున్నారు
శరీరాన్ని ఫిట్‌ గా ఉంచుకుంటూ ఎంతో మంది కి వారు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాంటి వారి లో అల్లు అర్జున్‌ భార్య అయిన స్నేహా రెడ్డి ముందు వరుస లో ఉంటారు. అల్లు అర్జున్‌ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు కూడా సోషల్‌ మీడియా వేదిక గా పంచుకుంటుంది స్నేహా రెడ్డి.. తన వ్యక్తిగత విషయాల ను కూడా ఫ్యాన్స్‌ తో షేర్‌ చేసుకుంటారు.
ముఖ్యం గా తన ఫిట్‌నెస్‌ కు సంబంధించిన వివరాలను కూడా ఫ్యాన్స్‌ తో పంచుకోవడం స్నేహాకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఒక ఆసక్తికరమైన వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. 2023 కి తన ఫిట్‌నెస్‌ గోల్స్‌ ఇవేనంటూ ఓ వీడియోను ఆమె షేర్‌ చేశారు. బరువు తగ్గడం కాదు శక్తివంతం కావాలని అనుకుంటున్నా అంటూ అలాగే భౌతిక ఆరోగ్యానికి బదులు ఆధ్యాత్మిక ఆరోగ్యం పొందాలనుకుంటున్నట్లు తన ఫిట్‌నెస్‌ జర్నీ ని పోస్ట్ చేశారు స్నేహా రెడ్డి. ఈ వీడియో తో పాటు.. 'సన్నగా ఉండడం ఫిట్‌ గా ఉండడం రెండూ ఒకటి కాదని ఫిట్‌నెస్ అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానిvకి సంబంధించినది. ఈ సంవత్సరం నేను నా ఫిట్‌నెస్ జర్నీ ని కొనసాగించడానికి ఎంతో కట్టుబడి ఉన్నాను' అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ ను రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే సెలబ్రిటీల వైఫ్స్‌ లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వారిలో స్నేహారెడ్డి మొదటి వరుసలో ఉంటారు. ప్రస్తుతం స్నేహాను ఇన్‌స్టాగ్రామ్‌ లో ఏకంగా 8.8 మిలియన్ల మంది ఫాలో అవుతుండడం గమనార్హం.. ఆమె కేవలం 568 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారటా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: