అనుష్క బరువు తగ్గకపోవడానికి కారణం అదేనా...?

murali krishna
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన గా మరికొన్ని నెలల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ మధ్య కాలం లో అనుష్క ఫోటోలలో, వీడియోల లో చాలా బొద్దు గా కనిపిస్తున్నారు. అనుష్క లుక్ ను చూసిన ఫ్యాన్స్ ఒకింత షాకవుతున్నారటా.. అయితే అనుష్క బరువు పెరగడాని కి థైరాయిడ్ కారణమని కూడా సమాచారం.
బరువు తగ్గడాని కి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ థైరాయిడ్ వల్ల ఆమె తగ్గలేకపోతున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అనుష్క స్లిమ్ లుక్ లోకి మారితే ఆమెకు ఆఫర్లు పెరుగుతాయ ని మరి కొందరు కూడా చెబుతున్నారు. అనుష్క థైరాయిడ్ తో బాధ పడుతున్నట్టు జోరుగా ప్రచారం కూడా జరుగుతుండగా ఈ వార్తల కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత అయితే రావాల్సి ఉంది. సీనియర్ హీరోలకు జోడీ గా కూడా అనుష్కకు ఆఫర్లు మాత్రం రావడం లేదు.
అనుష్క పారితోషికం కోటి రూపాయలకు దగ్గరగా ఉంది. ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో కూడా అనుష్కకు ఎక్కువ గా సినిమా ఆఫర్లు అయితే రావడం లేదటా.. అనుష్క భిన్నమైన కథలకు ఓకే చెప్పాలని మరి కొందరు సూచనలు చేస్తుండటం విశేషం.. తన స్థాయిని పెంచే ప్రాజెక్ట్ లలో అనుష్క నటిస్తే బాగుంటుందని మరి కొందరు కూడా సూచనలు చేస్తున్నారు.
అనుష్కకు పూర్వ వైభవం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.. సరైన కథలను ఎంచుకొని అనుష్క మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అనుష్క ఇతర హీరోయిన్ల కు భిన్నంగా అయితే అడుగులు వేస్తున్నారని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. అనుష్క పెళ్లి కి సంబంధించిన శుభవార్త కూడా వినాలని కూడా అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: