దసరా: డే 1 రికార్డులపై కన్నేసిన నాని?

Purushottham Vinay
దసరా.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ. నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు అయిన శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించాడు.ఇక ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా మార్చి 30 వ తేదీ న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఈ సినిమాను పూర్తి రా అండ్ రస్టిక్ సినిమాగా చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ చాలా గట్టిగా ప్రమోషన్స్ చేసింది.టాలీవుడ్ యంగ్ హీరో నాని తమిళనాడు, కేరళ ఇంకా నార్త్ ఇండియాలో దసరా మాసివ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు.ఇక ఈ సినిమా టీజర్ ఇంకా ట్రైలర్లతో పాటు 'చమ్కీల అంగీలేసి' పాట కూడా ఇఫ్పటికే ప్రేక్షకులను ఎంతో అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని టాలీవుడ్ ఇండస్ట్రీ చిత్ర వర్గాలు అంటున్నాయి.


ఇక దసరా మూవీ ఖచ్చితంగా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టడం ఖాయమని సమాచారం తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా హైప్ కారణంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సాలిడ్‌గా జరుగుతున్నాయని సమాచారం తెలుస్తుంది..ఇంకా అలాగే అటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు ట్రెమెండస్ క్రేజ్ రావడంతో అక్కడ కూడా ఈ సినిమా నాని కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలవనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. USA ప్రీమియర్స్ లో కూడా ఈ సినిమా చాలా మంచి గ్రోత్ చూపిస్తుందని సమాచారం తెలుస్తుంది. ఇక మరి ఈ దసరా సినిమాకి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ అందిస్తారా ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అనేది మున్ముందు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: