బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా.. ప్రపంచ రికార్డ్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమైన వారి లిస్ట్ తీస్తే అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే స్టార్ ప్రొడ్యూసర్ అయినా బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు శ్రీనివాస్. ఇక భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో బెల్లంకొండ శ్రీనివాస్ కి మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అవి సరైన హీట్ మాత్రం సాధించడం లేదు.

 విభిన్నమైన కథలతో వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమాల్లో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించినవి చాలా తక్కువే ఉన్నాయి అని చెప్పాలి. ఇలా అతని కెరియర్లో  యావరేజ్ టాక్ తెచ్చుకున్న  సినిమాలలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక సినిమా కూడా ఒకటి. 2017 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకొని సూపర్ హిట్గా నిలిచింది అని చెప్పాలి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అటు యూట్యూబ్ లో కూడా ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది అనే విషయం తెలిసిందే.

 అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ యాక్షన్ డ్రామా సినిమా ఇక ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించింది అని చెప్పాలి.. ఏకంగా 709 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో 709 కోట్ల వ్యూస్ వచ్చిన మొట్టమొదటి సినిమాగా జయ జానకి నాయక రికార్డు సృష్టించింది అని చెప్పాలి. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోయినప్పటికీ హిందీ ఆడియన్స్ ని మాత్రం బాగా మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ సినిమా 702 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుని సెకండ్ ప్లేస్ లో ఉంది. కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చత్రపతి సినిమా హిందీ రీమేక్లో నటిస్తూ ఉండడం గామనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: