రామ్ చరణ్ వదిలేసిన 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే?

praveen
ప్రస్తుతం ఇంటెర్నేషనల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్, మెగాస్టార్ తనయుడిగా మాత్రమే కాకుండా తనకు తానుగా పెంచుకున్న పేరు ప్రతిష్టలతో ఇండియా మొత్తం కొనియాడబడుతున్నాడు.  మెగా స్టార్ అండతో మొదటి సినిమా చేసినప్పటికి తన ట్యాలెంట్ తో మాత్రమే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పటి వరకు కెరీర్ మొత్తం లో కేవలం 14 సినిమాలు మాత్రమే చేసిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయి చాల మంది స్టార్ హీరోలకు సవాలుగా మారిపోయాడు. అయితే ఈ 14 సినిమాలో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికి కొన్ని మంచి సినిమాలను కూడా రిజెక్ట్ చేసాడు రామ్ చరణ్. మరి ఆలా మన రామ్ చరణ్ మిస్ చేసిన ఆ మూడు సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
శ్రీమంతుడు
మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కి 2015 లో విడుదల అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు మొదట రామ్ చరణ్ హీరో అయితే బాగుంటుంది అని కొరటాల భావించాడట. చరణ్ కి కూడా కథ బాగా నచ్చిన డేట్స్ అడ్జస్ట్ చేయడం లో ఇబ్బందులు ఎదురుకావడం తో ఈ సినిమా వదులుకున్నాడు రామ్ చరణ్.
జెర్సీ
నాని హీరో గా నటించిన జెర్సీ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం లో నాని కెరీర్ లో మంచి సినిమా గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని మొదట దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చరణ్ తో చేయాలి అనుకున్నప్పటికీ అప్పటికే రాజమౌళి కి ఆర్ ఆర్ ఆర్ కి కమిట్ కావడం తో ఈ సినిమా చేయడం వీలు కాలేదు.
ఒకే బంగారం
దుల్కర్ సల్మాన్ మరియు నిత్య మీనన్ జంట గా వచ్చిన సినిమా ఒకే బంగారం. ఈ చిత్రం సైతం మొదట రామ్ చరణ్ దగ్గరికే వచ్చింది. ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా రాం చరణ్ చేస్తే బాగుంటుంది అని దర్శకుడు భావించిన మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న రామ్ చరణ్ లవ్ స్టోరీ చేయడం కుదరదు అని చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: