ఆ అవసరం నాకు లేదంటున్న సమంత..!

shami
సమంత తిరిగి మళ్లీ ఫాం లోకి వచ్చింది. యశోద టైం లో ఆమె మయోసైటిస్ తో బాధపడుతుండగా సినిమాకు ఎంతోకొంత హెల్ప్ అవుతుంది అని సమంత ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. అది కూడా ట్రీట్ మెంట్ జరుగుతున్నా మధ్యలో ఆ చిట్ చాట్ కోసం వచ్చింది. అయితే ఆ టైం లో సమంత ఫేస్ చూసి ఆమె ఫ్యాన్స్ చాలా కంగారు పడ్డారు. ఫైనల్ గా మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత మళ్లీ తన ఫాం కొనసాగిస్తుంది. త్వరలో రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తుంది.
ఇక తనకు జరిగిన అన్ని విషయాల గురించి ప్రస్థావిస్తూ అంతా మంచికే అంటుంది. అంతేకాదు తన రెమ్యునరేషన్ గురించి తాను డిమాండ్ చేస్తానని. తనకు ఎంత ఇవ్వాలి అన్నది తనతో పనిచేయించుకునే వారికి తెలుసని.. సో తను అడుక్కోవాల్సిన పనిలేదని అంటుంది సమంత. మామూలుగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కి అసలు డిమాండ్ ఉండదు. కానీ సమంత ఆ ఫార్మెట్ మార్చేసింది. పెళ్లి తర్వాత ఎన్నో సమస్యలు వచ్చినా తిరిగి మళ్లీ మెరిసిపోతుంది.
ఇప్పటికీ ఆమె సినిమాలోని పోస్టర్స్ వదిలితే ఇదే మొదటి సినిమా అనేలా ఆమె లుక్స్ ఉంటాయి. అందుకే సమంత ఇప్పటికీ వరుస సినిమాలతో తన ఫాం కొనసాగిసుతంది. డిమాండ్ ఉంది కాబట్టి ఆమె కోరినంత నిర్మాతలు ఇస్తున్నారు. శాకుంతలం తర్వాత బాలీవుడ్ లో వెబ్ సీరీస్ చేస్తున్నా సమంత టాలీవుడ్ లో రెండు పెద్ద సినిమాల డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. సమంత మాత్రం తెలుగు కన్నా హిందీలో వరుస ప్రాజెక్ట్ లు చేయాలని ఆలోచనలో ఉందని టాక్. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న భారీగా రిలీజ్ కాబోతుంది. సినిమా సమర్పించిన దిల్ రాజు సినిమా పక్కా ఆడియన్స్ ని అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: