ఈ
మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ
మూవీ తెలుగు లో వారసుడు పేరుతో విడుదల అయింది. ఈ
సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
విజయ్ "లియో" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి
లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో
విజయ్ సరసన
త్రిష హీరోయిన్ గా కనిపించబోతుంది.
ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ
మూవీ లేటెస్ట్ షెడ్యూల్
మార్చి 29 వ తేదీ నుండి
చెన్నై లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొన్ని రోజుల్లో ఈ
మూవీ యూనిట్
హైదరాబాద్ లో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని
అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.