అమరావతి వివాదంలో మహేష్ !

Seetha Sailaja
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసిన తరువాత కొనసాగుతున్న అమరావతి రైతుల ఉద్యమం పాదయాత్ర అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికి కూడ అమరావతి పరిస్థితి పై ఎవరికీ క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య సూపర్ మహేష్ ఈ అమరావతి రగడలో దర్శకుడు త్రివిక్రమ్ ఆలోచనలు వల్ల తల దూర్చవలసిన అవసరం ఏర్పడుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న మహేష్ త్రివిక్రమ్ ల మూవీకి అనేక ఆలోచనలు చేసిన తరువాత త్రివిక్రమ్ ‘అమరావతికి అటు ఇటు’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు. గుంటూరు బ్యాక్ డ్రాప్ గా అమరావతికి చెరో వైపున హీరోకు సంబంధం ఉన్న ఊళ్ళలో ఉండే రెండు కుటుంబాల కథగా దీన్ని త్రివిక్రమ్ తయారుచేసాడు అని టాక్.

ఆ కుటుంబాల మధ్య ఉన్న వైరాన్ని హీరో పాత్రలో నటిస్తున్న మహేష్ ఒక ప్రత్యేకమైన సంకల్పంతో అక్కడికి వచ్చి ఎలా ఆసమస్యను చక్కపెట్టాడు అన్నది ఈ మూవీ కథ అంటున్నారు. ఇలాంటి కథలు గతంలో చాల వచ్చినప్పటికీ త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైన్మెంట్ ఈ కథలో చాల వెరైటీగా కనిపిస్తుంది అని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈమూవీలో యాక్షన్ సీన్స్ చాల ఎక్కువగా ఉంటాయట.

పల్లెటూరి వాతావరణంలో వచ్చే కథలు ఈమధ్య చాల తక్కువగా వస్తూ ఉండటంతో ఈ వెరైటీ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని త్రివిక్రమ్ అంచనా అని అంటున్నారు. ఈ టైటిల్ ఫిక్స్ చేయడంలో త్రివిక్రమ్ సెంటిమెంట్ కూడ బాగా ప్రభావితం చేసి ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ చాల వరకు తన సినిమాలు అన్నింటికీ ‘అ’ అక్షరంతో మొదలయ్యే టైటిల్ పెట్టడం తన సక్సస్ ఫార్మలాగా మార్చుకున్నాడు. అయితే ఎక్కడా అమరావతి రాజధాని ప్రస్తావన లేకుండా కేవలం అమరావతి పేరును మాత్రమే త్రివిక్రమ్ ఈమూవీలో చాల తెలివిగా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: