రావణాసుర ట్రైలర్ విడుదలపై మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే  ఈ మూవీ లో ద్రాక్ష నాగర్కర్ , మేఘ ఆకాష్ , ఫరియా అబ్దుల్లా , అను ఇమాన్యుయల్ , పూజిత పన్నోడా ముఖ్య పాత్రలలో నటించగా ...  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో సినిమా లలో హీరో గా నటించి అలా వైకుంఠపురంలో సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన సుశాంత్ ఈ మూవీ లో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ... వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల కు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ ను రేపు అనగా మార్చి 28 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ స్టైలిష్ లుక్ లో నడిచి వస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ధమాకా మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ "రావణాసుర" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: