అఫీషియల్ : బెల్లంకొండ శ్రీనివాస్ "చత్రపతి" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. అల్లుడు శీను మూవీ మంచి విజయం సాధించడంతో ఈ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అనేక మూవీ లలో హీరోగా నటించిన ఈ యువ హీరో రాక్షసుడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా ఈ యువ హీరో అల్లుడు అదుర్స్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల థియేటర్ లలో విడుదల అయింది. అలా మామూలు అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల ఆయన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు లో సూపర్ హిట్ విజయం అందుకున్నటు వంటి చత్రపతి మూవీ ని హిందీ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ హిందీ రీమేక్ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: