బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ మీడియమ్ రేంజ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో కూడా మంచి హిట్ ని అందుకున్నారు బాలయ్య.ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇంకా ఈ సినిమా తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రీసెంట్ గా పూజాకార్యక్రమాలతో మొదలైంది. ఈ మూవీలో బాలకృష్ణ అదిరిపోయే లుక్ లో కనిపించనున్నాడు. ఇటీవలే ఉగాది పండగ సందర్భంగా బాలయ్య లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సూపర్ లుక్ లో బాలయ్య అదిరిపోయారు. ఇక ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.


అలాగే ఈ మూవీలో లేటేస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ అయిన శ్రీలీల కూడా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల బాలయ్యకి కూతురిగా నటిస్తోందని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ మూవీలో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తో పాటు.. యాక్షన్ కూడా ఉంటుందని సమాచారం తెలుస్తోంది.ఇదిలా ఉంటే టాటా ఐపీల్ కోసం కామెంటేటర్ అవబోతున్నారు నట సింహం నందమూరి బాలకృష్ణ. ఇక ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ స్వయంగా ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి రోజు బాలకృష్ణ కామెంటరీ ఉండనుందని తెలిపింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ గా మారాయి. మార్చి 31వ తేదీన ప్రారంభమవబోతున్న ఐపీఎల్ మొదటి రోజు బాలయ్య కామెంట్రీ ఉండనుంది.ఇక నందమూరి బాలకృష్ణ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం టాక్ షో హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ టాక్ షో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: