"దాస్ కా దమ్కి" మూవీకి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ మార్చి 22 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ నుంచి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రస్తుతం మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెకన్ ల వివరాలు తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.45 కోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ ... 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.54 కోట్ల షేర్ ... 2.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 8.37 కోట్ల షేర్ ... 16.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ప్రస్తుతం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ.లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: