ప్రకాష్ రాజ్ టాప్ 3 బెస్ట్ రోల్స్ ఇవే?

Purushottham Vinay
పాన్ ఇండియా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ఇక ఈరోజు తన 58వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కేవలం కుటుంబ పాత్రలు ఇంకా విలన్‌గానే కాకుండా కామెడీ పాత్రల్లో కూడా నటించారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాదు హిందీ సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్ తనదైన ముద్ర వేశారు.


1997లో  వచ్చిన  ప్రకాష్‌ రాజ్ నటించిన 'ఇరువర్‌' చిత్రం అద్భుతమైన చిత్రాలలో మొదటి స్థానంలో ఉంటుంది.ఇది పొలిటికల్ డ్రామా కథ. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్‌తో పాటు టబు, ఐశ్వర్యరాయ్, గోమతి, మోహన్‌లాల్‌లు నటించారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌, ప్రకాష్‌రాజ్‌లను రాజకీయ ప్రత్యర్థులుగా చూపించారు. తమిళంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది.  


'బొమ్మరిల్లు' సినిమాలో ప్రకాష్‌రాజ్‌తో పాటు సిద్ధార్థ్‌, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. 
ఈ సినిమాకి భాస్కర్ దర్శకత్వం వహించారు. తండ్రీ కొడుకుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాలా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్  తండ్రీ కొడుకులుగా చేశారు. వీరు ఇద్దరూ అద్భుతమైన పాత్రలు పోషించారు.  కానీ ప్రకాష్ రాజ్ కి ఎక్కువ పేరు వచ్చింది.


ఇంకా ప్రకాష్ రాజ్ సినిమాల్లో 'పరుగు' ఒక అద్భుతమైన చిత్రం అనే చెప్పాలి. ఇది ప్రజలకు చాలా నచ్చింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు అల్లు అర్జున్, పూనమ్ బజ్వా, షీలా కౌర్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన ఇద్దరు కూతుళ్లను అమితంగా ప్రేమించే తండ్రి పాత్రలో కనిపించాడు. అతని నటన ఈ సినిమాలో అందరి కంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన "రంగమార్తాండా" అనే సినిమాలో కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ నటన చాలా అద్భుతంగా జనాలకి కనెక్ట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: