ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాల కు అనుగుణం గానే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ... అదిరిపోయే కథతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ మహేష్ కెరియర్ లో 28 వ
మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు ఈ
మూవీ యూనిట్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ
మూవీ షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా ఈ
మూవీ ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ
మూవీ యొక్క
ఆడియో రైట్స్ ను ఒక ప్రముఖ
ఆడియో సంస్థ 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ రేంజ్ లో ఈ
మూవీ ఆడియో రైట్స్ కు ధర రావడానికి ప్రధాన కారణం
త్రివిక్రమ్ ఆఖరి
సినిమా అయినటువంటి అలా వైకుంఠపురంలో మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో బ్లాక్ బాస్టర్ అవడంతో ఈ
మూవీ ఆడియో రైట్స్ కి ఈ రేంజ్ ధర వచ్చినట్లు తెలుస్తోంది.