అఖిల్ కు మాత్రమే ఎందుకు అలా జరుగుతోంది..!!

Divya
అక్కినేని నాగార్జున నట వారసుడుగా అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేసిన ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ తెలపలేదు. అఖిల్ మార్కెట్కు మించి దాదాపుగా ఈ సినిమా కోసం రూ .80 కోట్లు ఖర్చు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథా అంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది సురేందర్ రెడ్డి. హీరోయిన్గా సాక్షి వైద్య టాలీవుడ్లోకి మొదటిసారిగా ఎంట్రీ ఇవ్వబోతోంది ఇదంతా ఇలా ఉండగా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న ఈ సినిమా నుంచి ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఎక్సైట్మెంట్ చేసే అప్డేట్ మాత్రం రాలేదు. అప్పుడప్పుడు పోస్టర్ని విడుదల చేస్తూ ఉన్న ఏమాత్రం అవి ఆకట్టుకోలేకపోతున్నాయి ఒక్కొక్క అప్డేట్ వస్తున్న అవి సినిమా మీద ఇంట్రెస్ట్ ను తగ్గించేలా చేయడం తప్ప హైపు తెచ్చేలా కనిపించడం లేదు.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఈ సినిమా పూర్తి చేసుకోలేదని సమాచారం. ఈ కారణంగా సినిమా ప్రమోషన్స్ మరింత ఆలస్యంగా అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాటలను విడుదల చేసిన కూడా అవి ఏమాత్రం ప్రేక్షకులకు ఎక్కడం లేదు.. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలి అంటే కచ్చితంగా టీజర్ సాంగ్స్ ట్రైలర్ పై భారీ స్పందన క్రియేట్ అవ్వాలి ఏజెంట్ సినిమాలో ఏదో కొత్తగా సురేందర్ రెడ్డి చెప్పబోతున్నాడని ఆసక్తి అందరికీ చూపించాలి అప్పుడైతేనే ఈ సినిమా హైపు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి హైపర్ రాకపోవడంతో అఖిల్ సినిమాకి ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: