ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అప్డేట్..!!

Divya
పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు తన నుంచి సినిమా విడుదల కాక దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తోంది. ఎప్పుడో మొదలైన హరిహర వీరమల్లు సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి అప్డేట్ మాత్రం లేదు.వరుసగా సినిమాలను మాత్రం ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హరి శంకర్ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేశారని కూడా వార్తల వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం పది రోజులు మాత్రమే డేట్లు కేటాయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 15 వరకు ఈ సినిమా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ తర్వాత వినోదయ శీతమ్  రీమేక్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమా షూటింగ్లో మే నెలలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తమిళంలో హిట్ అయిన తేరి అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రాలు ఎప్పుడు విడుదలవుతాయా అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూడడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఈ చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: