విశ్వక్ సేన్ ఆఖరి 5 మూవీల రెండు తెలుగు రాష్ట్రాల మొదటి రోజు కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే విశ్వక్ నటించిన ఆఖరి ఐదు మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
దాస్ కా దమ్కి : ఈ మూవీ.లో విశ్వక్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. నివేత పేతురాజ్ ఈ సినిమాలో విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మార్చ్ 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.06 కోట్ల కలెక్షన్ లని వసూలు చేసింది.
ఓరి దేవుడా : విశ్వక్ హీరోగా రూపొందిన ఈ మూవీ కి ఆశ్విత్ మరిముత్తు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ కీలకమైన పాత్రలో నటించాడు.
అశోక వనంలో అర్జున కళ్యాణం : విశ్వక్ హీరో గా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం 65 లక్షల కలెక్షన్ లను మాత్రమే వసూలు చేసింది.
పాగల్ : విశ్వక్ హీరోగా నటించిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
హిట్ ది ఫస్ట్ కేస్ : విశ్వక్ హీరోగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: