ఆ క్రేజీ సంస్థకు రవితేజ "రావణాసుర" ఓవర్సీస్ హక్కులు..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘ ఆకాష్ , దక్ష నాగర్కర్ , పూజిత పొన్నాడ , ఫారియ అబ్దుల్లా , అను ఇమ్మానుయేల్ ముఖ్య పాత్రలలో నటించగా ... టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
 

ఇప్పటికే ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మరియు కొన్ని పాటలను కూడా ఈ మూవీ బృందం ఇప్పటికే విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటు ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రవితేజ ... నాని తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ మరి కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డీల్ ను తాజాగా క్లోజ్ చేసింది. ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ఫర్స్ ఫిలిం సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ధమాకా లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ పై రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: