పవన్ మూవీలో ఆ ముద్దుగుమ్మ నటించడం లేదు ... క్లారిటీ వచ్చేసింది..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీరమల్లు మూవీ లోను ..m సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతం రీమిక్ మూవీ లోను హీరో గా నటిస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను ... సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే "ఓజి" మూవీ లోను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం హరీష్ ... సుజిత్ లు ఇద్దరు కూడా వారి వారి సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

అందులో భాగంగా ఇప్పటికే పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు ... అందులో భాగంగా మొదటి హీరోయిన్ గా శ్రీ లీల ను ఇప్పటికే చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్లు గాను రెండవ హీరోయిన్ గా మాళవిక మోహన్ ను ఈ మూవీ యూనిట్ ఓకే చేసినట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో హీరోయిన్ గా తనుకు అవకాశం వచ్చింది అనే వార్తలపై మాలవిక  సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాజాగా మాళవిక సోషల్ మీడియా వేదికగా ... పవన్ కళ్యాణ్ గారి పట్ల నాకు చాలా అభిమానం ఉందని ... అయితే అందరికీ ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నాను.

ఈ మూవీ లో నేను వర్క్ చేయడం లేదని కానీ వేరే తెలుగు మూవీ లలో అయితే నటిస్తున్నాను అని ఈ వైరల్ అవుతున్న టాక్ పై మలవిక క్లారిటీ ఇచ్చింది. ఇలా ఈ ముద్దుగుమ్మ పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ లో నటించడం లేదు అనే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మాళవిక తెలుగు లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: