"ఎన్టీఆర్ 30" గురించి అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన కొరటాల శివ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ టాలెంట్ ఉన్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ఈయన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క ... రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ లుగా రూపొందిన మిర్చి మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను ప్రారంభించాడు. మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత శ్రీమంతుడు ... జనతా గ్యారేజ్ ... భరత్ అనే నేను మూవీ లతో వరుస విజయాలను అందుకున్నాడు.

పోయిన సంవత్సరం ఈ దర్శకుడు ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించి ఘోరమైన పరాజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా ఆచార్య మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన కొరటాల తన తదుపరి మూవీ ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభం అయింది. ఈ మూవీ పూజ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ... ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించనున్న జాన్వి కపూర్ కూడా ఈ మూవీ పూజా కార్యక్రమాలకు విచ్చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో భాగంగా కొరటాల శివ ... ఎన్టీఆర్ తో మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ గా ఉంటుంది అని ... అలాగే ఈ మూవీ కోసం తను బెస్ట్ టీం తో పని చేస్తున్నట్లుగా తెలియజేశాడు. ఇలా కొరటాల ఈ సినిమానే తన కెరియర్ లో బెస్ట్ వర్క్ గా నిలపబోతుంది అని చెప్పడంతో ఈ మూవీ పై ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: