మరాఠి భాషలో సంచలన విజయం సాధించిన నట సామ్రాట్ సినిమాను తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేసారు సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ. చాలా రోజులుగా ఇండస్ట్రీ వర్గాలలో సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఈ ఉగాది పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ హిట్ కొట్టాడా లేదా అనే విషయం తెలుసుకుందాం..ఇంకా ఈ సినిమా కథ విషయానికి వస్తే రంగమార్తాండ రాఘవరావు ( ప్రకాష్ రాజ్) ప్రముఖ రంగస్థల నటుడు. ఎన్నో చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా కూడా తన సేవలు కేవలం నటనారంగానికి మాత్రమే చెందాలని అక్కడికి వెళ్లకుండా నాటకాలలోనే ఉండిపోతాడు. ఆయనకు స్నేహితుడు ఇంకా గురువు అన్ని కూడా చక్రవర్తి (బ్రహ్మానందం) అనే వ్యక్తి.
ఇక ఓ వయసు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతాడు రాఘవరావు. అలా రిటైర్ అయిన వెంటనే తన ఆస్తులను తన కూతురు, కొడుకులకు పంచేస్తాడు రాఘవరావు. తనకంటూ ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా పూర్తిగా వాళ్లకే రాసి ఇచ్చేస్తాడు. అలా అయ్యాక ఆ తర్వాత ఏమైంది..? కొడుకు, కూతురు దగ్గర కూడా తన భార్య(రమ్యకృష్ణ)తో కలిసి రాఘవరావు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? అసలు ఒకప్పుడు రాజులా బతికిన రాఘవరావు చివరికి రోడ్ల పక్కన డాబాల్లో ప్లేట్లు కడుక్కునే స్థాయికి పాపం ఎలా దిగజారిపోయాడు.. అసలు అతని జీవితంలో ఏం జరిగింది అనేది ఈ సినిమా యొక్క అసలు కథ..
ఇది ఖచ్చితంగా కృష్ణ వంశీ మార్క్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అమ్మానాన్నల కథతో ఇదివరకు చాలా సినిమాలు వచ్చినా కూడా రంగమార్తండ మాత్రం కాస్త ప్రత్యేకమే. ఎందుకంటే ఇందులో ఓ సోల్ ఉంటుంది. కృష్ణ వంశీ అనుభవం తాలుక పర్ఫెక్షన్ ఉంటుంది. అయితే కమర్షియల్ అంశాలు తక్కువగానే ఉన్నా చూస్తున్నపుడు మాత్రం కచ్చితంగా కన్నీరు పెట్టించే సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో బ్రహ్మానందం ఇంకా ప్రకాష్ రాజ్ మధ్య హాస్పిటల్ సన్నివేషాలు అయితే అద్భుతంగా కుదిరాయి. మంచి మూవెంట్స్ కోసం రంగమార్తండ సినిమా హాయిగా చూసేయొచ్చు..