అదరగొడుతున్న కళ్యాణ్ రామ్ డెవిల్ లుక్..!!

Divya
మొదట ఆహా లో వచ్చిన సిన్ అనే వెబ్ సిరీస్ కు డైరెక్టర్ గా పని చేశారు నవీన్ మేడారం. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న డెవిల్ సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కూడా చాలా విభిన్నంగా కనిపించబోతున్నరు. అంతేకాకుండా ఈ సినిమా పీరియాడికల్ మూవీగా రాబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న డెవిల్ సినిమా నుంచి ఉగాది సందర్భంగా ఒక క్రేజీ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది.
ఈ పోస్టర్లో కళ్యాణ్ రామ్ లుక్కు మాత్రం అదిరిపోయింది అని చెప్పవచ్చు .ముఖ్యంగా కింద పంచే పైన కోట్ ఒక చేత్తో ఇంటెన్స్ లుక్ నందమూరి అభిమానులను కాకుండా సగటు ప్రేక్షకుని కూడా బాగా ఆసక్తి కలిగించేలా కనిపిస్తోంది.ఇక పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఒక పెద్ద షిప్ కూడా మనం గమనించవచ్చు. మొత్తానికి కళ్యాణ్ రామ్ ఇ సారి కూడా ఒక భారీ ప్రయోగంతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ రీసెంట్గా అమీగొస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సక్సెస్ కాలేకపోయారు.

అయినప్పటికీ కూడా డెవిల్ చిత్రంతో మరొకసారి తన ప్రయోగం చేయబోతున్నారు. ఈ సినిమాని నిర్మాత అభిషేక్ నాయ నిర్మిస్తూ ఉన్నారు.ఇంతవరకు ఈ సినిమా పాయింట్ ని ఎవరు టచ్ చేయలేదని కూడా చెబుతూ ఉన్నారు డిఫరెంట్ కదలతో తెలుగు ఆడియన్స్ కు ఒక కొత్త సినిమాని పరిచయం చేయబోతున్నట్లుగా ఉన్నామని అందుకే కళ్యాణ్ రామ్ తో డెవిల్ సినిమాని పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు.డెవిల్ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు ప్రస్తుతం కళ్యాణ్ రామ్ పోస్టర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: