ఉగాది స్పెషల్ గా ఆకట్టుకుంటున్న నాగచైతన్య- కృతి శెట్టి..!!

Divya
అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా నటించిన చిత్రం థాంక్యూ ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్నే చవిచూసింది. దీంతో మల్లి కథల విషయంలో పలు జాగ్రత్తలు వ్యవహరిస్తూ ఉన్నారు. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లాల్ సింగ్ చద్దా సినిమాలో కూడా నటించారు నాగచైతన్య. ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలచడంతో వెంకట ప్రభు డైరెక్షన్లో కస్టడీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్ పోస్టర్స్ మంచి హైప్ ని తీసుకువచ్చాయి.

ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ని విడుదల చేశారు .నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నది. ఈ సినిమా నుంచి వీరిద్దరూ హగ్ చేసుకున్నటువంటి ఒక ఫోటోని రిలీజ్ చేయడం జరిగింది. భయంతో ఉన్న ప్రేయసికి నేను తోడు ఉన్నానంటూ  ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ పోస్టర్ కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అందుకే పోస్టర్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చైతన్య కళ్ళల్లో కూడా చాలా తెగింపు కనిపిస్తోంది.కృతి చూపులలో మాత్రం చాలా భయం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. గతంలో కూడా కృతి శెట్టి, నాగచైతన్య కలిసి బంగార్రాజు చిత్రంలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే హిట్ సెంటిమెంట్ ని రిపీట్ చేయబోతున్నారు నాగచైతన్య కస్టడీ సినిమాకు ఈ సినిమాలో కొన్ని క్లాస్ బాక్ సీన్స్ నాగచైతన్య వింటేజ్ నాగార్జున లుక్స్ ని తలపిస్తున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించి టీజర్ లోని ఒక చోటు ఇప్పటికే అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. మొత్తానికి నాగచైతన్య కృతి శెట్టి కలిసి మరొకసారి ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: