చిరంజీవి "భోళా శంకర్" విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి అజిత్ హీరో గా రూపొందిన వేదాలం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. భోళా శంకర్ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ... మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

 ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకేక్కుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులే అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక.పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో చిరంజీవి ... తమన్నా ... కీర్తి సురేష్ లు ఉన్నారు. ఈ పోస్టర్ లో చిరంజీవి నిలుచుని ఉండగా ... తమన్నా మరియు కీర్తి సురేష్ లో కుర్చీbలో కూర్చొని ఉన్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేర్ వీరయ్య మూవీ తో సూపర్ హిట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న చిరంజీవి మరి భోళా శంకర్ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: