చీర కట్టులో మరింత స్టైలిష్ గా అనసూయ..!!

Divya
తెలుగు బుల్లితెరపై అందమైన యాంకర్ గా గుర్తింపు పొందింది నటి అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే వెండితెరపై కూడా పలు అవకాశాలను అందుకుంటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. యాంకర్ గా అతి తక్కువ సమయంలోనే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందం తన డాన్స్ స్కిల్స్ తొ సినిమాలలో పలు అవకాశాలను అందుకుంది. మొదట స్పెషల్ అపీరియన్స్ తో బిగ్ స్క్రీన్ పైన తన అభిమానులను ఆకట్టుకున్న అనసూయ... క్షణం రంగస్థలం వంటి సినిమాల తో మొదటిసారి తన నటనకు మంచి అవకాశం దక్కింది.
తనలోని నటనను బయటికి తీస్తూ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేసింది. అలా వరుస సినిమాలలో నటిస్తూ మంచి క్రేజీ సంపాదించింది అనసూయ. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ తన వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తూ కనిపిస్తోంది. అలాగే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ పలు లొకేషన్స్ కు వెళ్తూ కనిపిస్తోంది అనసూయ. తన నుంచీ రాబోయే సినిమాలలో అనసూయ కీలకమైన పాత్రలు నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అనసూయ రంగమార్తాండ సినిమాలో కీలకమైన పాత్రలు నటించింది. ఈ సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది భాగంగా అనసూయ కొన్ని ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది.. స్లీవ్ లె స్ బ్లౌజులు అనసూయ గ్లామర్ మెరుపులతో మైమరిపించేలా చేస్తోంది. ఈమెను ఈ ఫోటోలలో చూసిన అభిమానులు సైతం లైక్స్, కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు. బుల్లితెరకు గుడ్ బాయ్ చెప్పినా అనసూయ పూర్తిగా సినిమాల పైన ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప -2 చిత్రం షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అనసూయ కు సంబంధించి ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: