పాన్
ఇండియా టాప్
డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన
rrr సినిమాతో యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ పాన్
ఇండియా వైడ్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
హాలీవుడ్ ప్రేక్షకులు కూడా
ఎన్టీఆర్ నటనకు ఎంతగానో ముగ్దులు అయ్యిపోయారు.ఇక నాటు నాటు పాట
ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడంతో ప్రస్తుతం
rrr పేరు, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులు పేర్లు ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజిలో వినబడుతున్నాయి. ముఖ్యంగా
ఎన్టీఆర్, చరణ్ కి గ్లోబ్ స్థాయిలో భారీ పాపులారిటీ అనేది లభించింది. ఇక ఈ ఫేమ్ ని పలు కంపెనీలు తమ బ్రాండ్ కి ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ తో ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ ఆపీ ఫిజ్ (Appy Fizz) పాన్
ఇండియా యాడ్ ని షూట్ చెయ్యడం జరిగింది.గతంలో
ఎన్టీఆర్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. అయితే అప్పుడు ఆయన కేవలం తెలుగు బాషకి మాత్రమే వ్యవహరించాడు.
అయితే ఇప్పుడు
rrr తో
ఎన్టీఆర్ కి వచ్చిన ఫేమ్ ని దృష్టిలో పెట్టుకొని మొత్తం 6 భాషలకి కూడా
ఎన్టీఆర్ నే బ్రాండ్ అంబాసిడర్ గా ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ,
హిందీ ఇంకా ఉర్దూ భాషల్లో
ఎన్టీఆర్ పై ఈ యాడ్ ని షూట్ చేశారు. ఇంకా ఈ యాడ్ లో
ఎన్టీఆర్ తో పాటు
బాలీవుడ్ బ్యూటీ
కృతి సనన్ కూడా నటించింది. గతంలో ఆపీ ఫిజ్ హిందీకి కండల వీరుడు
సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు.బాలీవుడ్ టాప్ స్టార్ అయిన
సల్మాన్ ని పక్కన పెట్టి
ఎన్టీఆర్ తో
హిందీ ఆపీ ఫిజ్ యాడ్ చేయించడంతో..
ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఎంతగానో సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, NTR30
మూవీ ఈ నెల 23 వ తేదీన స్టార్ట్ కానుంది.
కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని నందమూరి
కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు.