సలార్ : పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్?

Purushottham Vinay
ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్  చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. దాదాపు అన్ని కూడా భారీ బడ్జెట్తో కూడిన పెద్ద చిత్రాలే. ఇక వీటిన్నిటిలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘సలార్’.ఎందుకంటే కేజీఎఫ్ (KGF) దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం ఇటలీ వెళ్లనుంది. ఇక ఈ విషయాన్ని ఇటలీ మీడియా కూడా ప్రింట్ చేయడం గమనార్హం. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ మూవీ కేవలం పాన్ ఇండియా వైడ్ కాదట, పాన్ వరల్డ్ మూవీగా విడుదల కాబోతుంది.ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇంకా హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం తెలుస్తుంది.


కుదిరితే అన్ని భాషలతో పటు ఒకేసారి, లేదా తరువాత అయిన విడుదల చేయనున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉంది అనేది తెలియాలి అంటే మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.ఇటీవలే ఈ హాట్ బ్యూటీ పాత్రకి సంబంధించిన షూటింగ్ మొత్తం కూడా పూర్తి అయ్యింది.కేజీఎఫ్ చిత్రాలు నిర్మించిన హొంబాలే ఫిలింస్ ఈ సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా అలాగే జగపతి బాబు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ నటించిన మరో మూవీ ఆదిపురుష్ గ్రాఫిక్స్ కారణంగా పోస్ట్‌పోన్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కూడా ఇంకా ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: