NBK108: కాజల్ రెమ్యూనరేషన్ టూ మచ్ అబ్బా?

Purushottham Vinay
ఇక అప్పట్లో కుర్రకారు మోస్ట్ ఫెవరెట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్.వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది కాజల్. ఇక తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సడన్ గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చింది. అంతే కాదు ఇటీవల పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ బ్యూటీ. ఇక బిడ్డ పుట్టిన తర్వాత వరుస ఫోటో షూట్స్ తో అభిమానులను అలరించిన కాజల్...ఇక ఇప్పుడు మరోసారి తెర పై అలరించడానికి రెడీ అయ్యింది.టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి.


ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా ఓ పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ భామ బాలయ్యతో షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ సినిమాలో లీడ్ రోల్ గా చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఎంపిక అయ్యింది. తాజాగా ఈ భామ షూటింగ్ లో జాయిన్ అయ్యిన విషయాన్ని చిత్రయూనిట్ వారు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ కోసం కాజల్ అగర్వాల్ అందుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ మూవీలో కాజల్ కేవలం 40 నిముషాలు మాత్రమే కనిపిస్తుందట. ఈ ఒక్క 40 నిమిషాల కోసం ఆమె ఏకంగా రూ. 4 కోట్లు పారితోషికం అందుకుంటుందని సమాచారం తెలుస్తోంది. గతంలో బాలయ్య నటించిన లయన్ మూవీలో కూడా కాజల్ కు ఛాన్స్ వచ్చింది కానీ ఆ సమయంలో వరుస మూవీలు కమిట్ అవ్వడంతో ఆమె ఆ మూవీలో నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: