సూర్య 42: టైటిల్, విడుదల తేదీ, టీజర్ ఎప్పుడంటే?

Purushottham Vinay
తమిళ టాప్ హీరోల్లో ఒక్కడైన సూర్య నటిస్తోన్న సినిమాల్లో ఒకటి సూర్య 42. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమిళ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నాడు.సూర్య 42వ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటానీ ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ఇక ఓ వైపు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తూనే.. ఇంకా మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తుంటాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఇక మేకర్స్‌ ఈ సినిమా టైటిల్,ఫస్ట్‌ లుక్‌, విడుదల తేదీ ప్రోమోను త్వరలోనే అనగా ఇంకో రెండు వారాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న అప్‌డేట్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. అలాగే ఈ సినిమా టీజర్ ని మే 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య ఈ సినిమాతో మరింత స్టార్‌డమ్‌ సంపాదించడం ఖాయమని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇంకా ఈ చిత్రానికి వెట్రి పలనిస్వామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.


ఇక సూర్య 42 ప్రాజెక్ట్‌ 2డీ, 3డీ ఫార్మాట్‌లలో కూడా ఏకంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే సూర్య 42 నుంచి విడుదలైన లుక్‌ సోషల్ మీడియాలో బాగా హల్‌ చల్‌ చేస్తోంది. సూర్య ఈ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించినటువంటి పాత్రలో మెరువబోతున్నట్టు ఇప్పటికే రిలీజైన స్టిల్‌తో తెలిసిపోతుంది. సాధారణంగా సూర్య సినిమా అంటేనే కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం కూడా ఉంటుంది. మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి కొత్త అనుభూతిని కలిగిస్తాడో అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.ఇప్పటికే సూర్యకు అదిరిపోయే ఆల్బమ్స్ అందించిన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నాడు. సూర్య మరోవైపు బాలీవుడ్‌ యాక్టర్‌ అక్షయ్‌ కుమార్ నటిస్తోన్న సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో కూడా అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అదే విధంగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో కూడా వాడివాసల్ అనే సినిమాలో  నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: