గామి: విశ్వక్ కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌ ప్రస్తుతం దాస్ కా ధమ్‌ కీ అనే సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక డైరెక్టర్‌గా విశ్వక్‌సేన్‌కు ఇది రెండో సినిమా. ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో పాన్ ఇండియా లెవెల్ లో చాలా గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై చాలా మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. యాక్షన్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ నివేదా పేతురాజ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇక ఇదిలా ఉంటే విశ్వక్‌ సేన్‌ కాంపౌండ్‌ నుంచి ఇప్పటికే విడుదల కావాల్సిన గామి సినిమా అప్‌డేట్‌ చాలా కాలం తరువాత బయటకు వచ్చింది.ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం తరువాత ఈ గామి సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు విశ్వక్‌ సేన్‌. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న గామి సినిమా ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని, మరో రెండు నెలల్లో థియేటర్లలో విడుదలవుతుందని తెలిపాడు హీరో విశ్వక్‌ సేన్‌.


అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి ఇంకా అలాగే హారికా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్ శబరీష్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంకా అలాగే మరోవైపు విశ్వక్‌ సేన్‌ 20వ సినిమా హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో విశ్వక్ సేన్ సరసన నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ షురూ కానుంది.ఇలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: