తన పెళ్లి విషయం పై అదిరిపోయే సమాధానం ఇచ్చిన నివేదా...!!

murali krishna
ఎంతో మంది సెలబ్రెటీలు తమ పెళ్లిళ్ల గురించి చెప్పలేకపోతుంటారు.కొందరు మీకు అవసరమా అంటూ ముఖం మీదే కౌంటర్లు వేస్తూ ఉంటారు. అయితే తాజాగా నివేద థామస్ కి కూడా ఇటువంటి ప్రశ్న ఎదురవటంతో వెంటనే ఆమె ఓ షాకింగ్ సమాధానం అయితే ఇచ్చింది..
టాలీవుడ్ ముద్దుగుమ్మ అయిన నివేదా థామస్. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని  అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మరియు మలయాళ భాషలలో కూడా పలు సినిమాలలో కూడా నటించింది. అతి తక్కువ సమయంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుందటా.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తెగ సందడి చేస్తుంది.తొలిసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నివేదా థామస్ ఆ తర్వాత 2016 లో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాలో హీరోయిన్ గా అయితే పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు కూడ అందుకుంది. అలా కొన్ని సినిమాలలో సక్సెస్ అందుకున్న కూడా కొన్ని సినిమాలలో అంత సక్సెస్ అయితే పొందలేకపోయింది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించి వకీల్ సాబ్ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇక గత ఏడాది షాకిని డాకిని సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కొంతవరకు నివేద థామస్ కు మంచి గుర్తింపును ను అందించింది. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండగా నిత్యం ఏదో ఒక పోస్ట్ ను షేర్ చేసుకుంటూనే ఉంటుంది. బాగా డాన్స్ వీడియోలు కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తమ్ముడితో కూడా చిందులేసిన డాన్స్ వీడియోలను తెగ షేర్ చేసుకుంటుంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ అయితే వుంది.. తనకు సమయం దొరికినప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుందటా.. వాళ్ల అడిగిన సమాధానాలకు ఎంతో ఓపికగా సమాధానం ఇస్తుంది. అయితే తాజాగా మరోసారి తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టగా అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ మీ పెళ్లి ఎప్పుడు అని అడగటంతో.. నాకు ఎలాంటి ఆలోచన ఉద్దేశం ఏమీ లేవండి.. ఉన్నప్పుడు లేదా ఉంటే చెప్తా అంటూ తను గోరింటాకు పెట్టుకున్న ఫోటోలు ను పంచుకుంది. అంటే ఇప్పుడు ఆమెకు పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలు లేదు అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: