"ఎన్బికె108" సెట్స్ లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు అయినటు వంటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ... చందమామ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ... మగధీర మూవీ తో బ్లాక్ బాస్టర్  విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలం లోనే టాప్ హీరోయిన్ స్థానానికి చేరిపోయింది. ఇది ఇలా అంటే కొన్ని రోజుల క్రితమే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది.
 

అలాగే కొంత కాలం క్రితమే ఒక బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. ఇలా పెళ్లి అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కాజల్ క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను "ఎన్ బి కే 108" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ నిర్వహిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెట్స్ లో కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చినట్టు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: