ప్రేమ్ రక్షిత్: ఆర్ధిక సమస్యల నుంచి ఆస్కార్ రేంజ్ జర్నీ?

Purushottham Vinay
ప్రేమ్ రక్షిత్: ఆర్ధిక సమస్యల నుంచి ఆస్కార్ రేంజ్ జర్నీ?

ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఒక రేంజిలో సంచలనం సృష్టించింది. ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి విదేశీయులు.. హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ముగ్దులయ్యారు. ఇంటర్నేషనల్ స్టేజిపై ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఇటీవల లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డ్ ను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంకా అలాగే గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటకు ప్రధాన ఆకర్షణ ఖచ్చితంగా ఆయన చేసిన కొరియోగ్రఫీనే. ముఖ్యంగా తారక్, చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టెప్స్ అయితే వరల్డ్ వైడ్ గా తెగ ఫేమస్ అయ్యాయి. 


దీంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ వైపు మళ్లింది. ఈ సినిమాలోని స్టార్ హీరోస్, రాజమౌళితో పాటు.. ప్రేమ్ రక్షిత్ పేరు కూడా ఇప్పుడు బాగా మారుమోగింది.ఈమధ్యనే ఆస్కార్ అవార్డ్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రేమ్ రక్షిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డానని.. కానీ ఎస్ ఎస్ రాజమౌళి వరుసగా తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారని తెలిపాడు. “ఇక నేను కృష్ణానగర్ నుంచి వచ్చినవాడిని. అక్కడి ఎన్నో కష్టాలను చూసినవాడిని. డైరెక్టర్ రాజమౌళి ఇంట్లో కార్తికేయ.. కాలభైరవ.. సింహాలకు డాన్స్ నేర్పేవాడిని. ఇంకా అలాగే మరో ఇద్దరు కుర్రాళ్ల ఇళ్లకు కూడా వెళ్లి క్లాసులు తీసుకునేవాడిని. అలా వచ్చిన డబ్బుతోనే అతి కష్టం మీద రోజులు గడుపుతూ నేను ముందుకు వెళ్లేవాడిని” అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: