రమ్యకృష్ణ లో తనకిష్టమైన వాటి గూర్చి కామెంట్స్ చేసిన డైరెక్టర్....!!

murali krishna
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా పేరు ఉన్నా ప్రముఖ నటి రమ్యకృష్ణ. ఐతే ఇటీవల ఆమె భర్త ఐనా కృష్ణవంశీ రమ్య కృష్ణ పై చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం `రంగమార్తాండ`. ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 22న విడుదలవుతున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది.
ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ ఈ చిత్రంలో కీలక పాత్రలను పోషించారు. అయితే విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా డైరెక్టర్ కృష్ణ వంశీ ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగమార్తాండ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. రంగమార్తాండ సినిమా కథ ఆడియన్స్ ను కట్టిపడేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రమ్య కృష్ణ పాత్ర గురించి మాట్లాడారు.
ఐతే ఆ మూవీ లో `రమ్య చేసిన పాత్రకు మొదట వేరేవాళ్ళను అనుకున్నా ఆమె కూడా కొన్ని పేర్లు సూచించింది. కాని అది నువ్వే ఎందకు చేయకూడదు అంటూ రమ్యను రంగంలోకి దింపాము. ఆ పాత్ర కోసం తనే మేకప్, హెయిర్ స్టైల్ చేసుకుంది. ఇక ఎప్పుడూ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే రమ్మ కృష్ణ ఈసినిమాలో కళ్ళతోనే హావభావాలు పలికిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో రమ్య నటన చూసి కన్నీళ్లు ఆగలేదు. అంతలా తన నటనతో మెప్పించింది. రమ్యకృష్ణ కళ్ళు చాలా బాగుంటాయి. ఆమె రెండు కళ్లు నాకెంతో ఇష్టం` అంటూ కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు.
ఏదేమైనా అప్పట్లో రమ్యకృష్ణ ఫుల్ బిజీ యాక్ట్రెస్ గా మూడు షిఫ్ట్స్ లో చేసి ఎందరో ప్రేక్షకులకు హృదయాలు దోచుకున్న నటిగా పేరు పొందింది. ఆమె మొన్న బాహుబలి లో చేసిన పాత్ర అనేది నా భూతో నా భవిష్యత్ లాగా ఉంది అని నేటిజన్లు కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: