మహేష్ ఆ మూవీలో మరింత మాస్ గా కనిపించనున్నాడా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవం ... స్పైడర్ మూవీ లతో వరుసగా అపజాయలను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత భరత్ అనే నేను మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తరువాత మహర్షి ... సరిలేరు నీకెవ్వరు తాజాగా సర్కారు వారి పాట మూవీ ల విజయాలతో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఇలా ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్  ను ఫిక్స్ చేయను నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ ఈ చిత్ర బృందం పూర్తి చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ లో మహేష్ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లు అలాగే మరింత యంగ్ గా కనిపించనున్నట్లు మరియు ఈ మూవీ లో మహేష్ ఇది వరకు మూవీ ల కంటే అదిరిపోయే రేంజ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ లో ఫైట్స్ సన్ని వేషాలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే గతంలో మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు మరియు ఖలేజా మూవీ లు రూపొందాయి. ఈ రెండు మూవీ లకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. దానితో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: