వామ్మో: కబ్జా.. సినిమా రెండు రోజుల్లో రూ.100 కోట్ల..!!

Divya
కన్నడ సినీ ఇండస్ట్రీలో నుంచి కేజిఎఫ్ సిరీస్ విడుదలై ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. ఒక విధంగా చెప్పాలి అంటే సినిమా స్టైల్ ని కే జి ఎఫ్ సిరీస్ పూర్తిగా మార్చేసింది. బలమైన కంటెంట్ లేకపోతే కథ చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే విజయానికి ఈ చిత్రం ఉదాహరణ అని చెప్పవచ్చు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టార్ దర్శకుడుగా మారిపోయి కన్నడ సినీ ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

అయితే ఇప్పుడు కన్నడ నాట ఎంతో మంది దర్శకులు కూడా కేజీఎఫ్ తరహాలోనే కథలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కథనం పక్కన పెట్టి ఎలివేషన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది .తాజాగా వచ్చిన కబ్జా సినిమాను చూస్తే ఇలాగే అనిపిస్తోంది .ఈ సినిమా కేజిఎఫ్ డూప్లికేట్ అంటూ సినీ క్రిటిక్స్ రివ్యూలు రాయడం జరిగింది. ఉపేంద్ర కెరియర్ లోని ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా లో శివరాజ్ కుమార్, సుధీర్ లాంటి స్టార్ కాస్టింగ్ కూడా నటించారు.

అలాగే ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి రోజే డివైడ్ తెచ్చుకున్నది. కానీ ఈ చిత్రానికి సంబంధించి కలెక్షన్ల పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. రెండు రోజుల్లోనే ఏకంగా రూ  100 కోట్ల కలెక్షన్ లని కబ్జా రాబట్టిందని పోస్టర్తో విడుదల చేశారు. ఇప్పుడు ఈ కలెక్షన్ల పై సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తోంది. డిజాస్టర్ మూవీకి రెండు రోజుల్లో రూ .100 కోట్లు ఎలా కలెక్షన్లు సాధ్యమంటూ తెలియజేస్తున్నారు. కానీ కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రకారం రూ.25 కోట్లు వస్తే అక్కడ 100 కోట్లు లెక్క అంటూ ట్రోల్ చేస్తున్నారు.. మరి కొంతమంది ఇవి ఆడియన్స్ను తప్పుదావ పట్టించే కలెక్షన్స్ అంటూ కొట్టి పారేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: