ఎరుపు రంగు చీరలో కుర్రకారును మైమరపిస్తున్న మాళవికా మోహన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం మాళవిక కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా ... కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ అనే మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.
 

ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ అటు తమిళ్ ... ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
 

అందులో భాగంగా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా మాళవిక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న ఎరుపు రంగు చీరను కట్టుకొని అందుకు తగిన ఎరుపు రంగు బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మాలవిక కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: