నాగశౌర్య కొత్త సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటుడి గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఆఖరుగా కృష్ణ వ్రింద విహారి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇలా కృష్ణ వ్రింద విహారి మూవీ తో ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించిన నాగ శౌర్య తాజాగా ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మార్చి 17 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది.

ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కి సంబంధించిన "ఓ టి టి" హక్కులను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ డిజిటల్ సంస్థ కు అమ్మి వేసినట్లు ... అందులో భాగంగా ఈ మూవీ యొక్క కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో సన్ నెక్స్ట్ సంస్థ వారు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: