నిజమే.. ఆ ఒక్క సినిమాకి.. ఆస్కార్ వచ్చి ఉంటే బాగుండేది?

praveen
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ఆస్కార్ అవార్డుల గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో భాగంగా భారత్ కి రెండు ఆస్కార్ అవార్డులు లభించడం.. ఇందులో త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట కూడా ఆస్కార్ అవార్డు దక్కించుకుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక ప్రేక్షకులు కూడా గతంలో వచ్చిన కొన్ని సినిమాలకు ఆస్కార్ దక్కి ఉంటే చర్చలు కూడా తెరమీదకి తీసుకువస్తూ ఉన్నారు. ఇక ఇలా చర్చకు వస్తున్న కొన్ని సినిమాలలో ఒక సినిమా పేరు మాత్రం బలంగా వినిపిస్తుంది అని చెప్పాలి. అదే కమల్ హాసన్ హీరోగా నటించిన దశావతారం సినిమా.

 ఆస్కార్ అవార్డు గెలుచుకోవడానికి.. ఈ సినిమాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకు ఆస్కార్ అవార్డు రాలేదు అన్న విషయంపై మాత్రం ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన కమలహాసన్ కు అవార్డులకు ఏమీ కొదవలేదు. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సైతం ఎవరికి సాధ్యం కాని.. రీతిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు కమలహాసన్. ఇక 60 ఏళ్లు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ యువ స్టార్ హీరోలను మించిన దూకుడుతో  సినిమాలను చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కానీ కమలహాసన్ కెరియర్లో ఒకే ఒక అసంతృప్తి. అది ఆస్కార్ అవార్డు దక్కలేదని.

 కమల్ హాసన్ నటించిన సినిమాల్లో దాదాపు 7, 8 సార్లు ఆస్కార్ లభిస్తుందని ఎంతగానో ఆశపడ్డాడు కమలహాసన్.  కానీ లోక నాయకుడికి నిరాశ ఎదురయింది. అయితే కమల్ హాసన్ నటించిన దశావతారం సినిమాకు మాత్రం తప్పకుండా ఆస్కార్ అవార్డు లభిస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. ఎందుకంటే ఈ సినిమాలో 10 పాత్రల్లో కమలహాసన్ చేసిన నటన గురించి మాటల్లో వర్ణించడం చాలా కష్టమని చెప్పాలి.  అయినప్పటికీ ఈ సినిమా ఆస్కార్ లిస్టు లోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆస్కార్లోకి వెళ్లాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు డబ్బు కూడా ఖర్చు పెట్టాలి అన్నది ఇక రాజమౌళిని చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: