రానా నాయుడు పై ఆగని విమర్శల వెల్లువ...!!

murali krishna
బాబాయ్ వెంకటేష్ అబ్బాయి రానా ముఖ్య పాత్రల్లో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఇటీవలే నెట్ ప్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.భారీ అంచనాలతో రూపొందిన ఆ సిరీస్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారని తెలుస్తుంది.. ఆలస్యం అవుతున్నా కొద్ది అంచనాలు కూడా బాగా పెరిగాయి. అయితే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయిన తర్వాత మాత్రం ప్రేక్షకులు బాగా విమర్శిస్తున్నారు. స్వయంగా వెంకటేష్( మరియు రానా అభిమానులు కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.. వెంకటేష్ నుండి ఇలాంటి సిరీస్ ని అస్సలు ఆశించలేదని చాలా మంది కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ అనవసరం అంటూ చాలా మంది విమర్శిస్తున్నారటా.
ఒక ఫ్యామిలీ హీరో ను అడల్ట్ హీరో గా చూపించాలని వారు చేసిన ప్రయత్నం విఫలమైందని తెలుస్తుంది.. వెబ్ సిరీస్ అనగానే బోల్డ్ సీన్స్ రొమాన్స్ ఉండాలని ఒక ఫార్మేట్ లోనే వాళ్ళు ఉండి పోయారని తెలుస్తుంది.. ఆ ఫార్మట్ తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చదని మరో సారి నిరూపించబడింది. గతంలో ఎన్నో వెబ్ సిరీస్ లో హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా సక్సెస్ అయ్యాయి.
 కానీ తెలుగు లో మాత్రం అవి సక్సెస్ కాలేక పోయాయటా..ఇప్పటి వరకు తెలుగు లో అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఏ ఒక్క వెబ్ సిరీస్ కూడా సక్సెస్ అయితే కాలేదు. ఆ విషయం రానా నాయుడు మేకర్స్ కి తెలియనిది అయితే కాదు. అయినా కూడా వెంకటేష్ తో చేసిన ప్రయత్నం ఏమాత్రం సక్సెస్ కాలేదు. రాజమౌళి వంటి ఫిలిం మేకర్స్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఈ సమయం లో మన హీరోలు బూతు సినిమాలు చేస్తూ పరువు తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని తెలుగు ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: