దర్శకతధీరుడు
ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రాజమౌళి తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలా దర్శకత్వం వహించిన ప్రతి
మూవీ తోను అదిరిపోయే రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని
మూవీ ...
మూవీ కి తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. అందులో భాగంగా
రాజమౌళి ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్
మూవీ కి దర్శకత్వం వహించాడు.
ఈ
మూవీ లో మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ
మూవీ భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను కూడా అందుకుంది. అందులో భాగంగా తాజాగా ఈ
మూవీ లోని నాటు నాటు సాంగ్ లు
ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్
మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను సంపాదించుకున్న
రాజమౌళి తన తదుపరి
మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయనున్నాడు.
ఈ
మూవీ మహేష్ కెరియర్ లో 29 వ
మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన వేరే ఇతర వార్తలు ఏవి బయటకు రాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఈ
మూవీ యొక్క
పూజా కార్యక్రమాలను ఆగస్టు నెలలో ప్రారంభించడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.