బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇంట్లో విషాదం..!

Divya
అలనాటి అందాల తార బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె కన్నతల్లి స్నేహాలతా దీక్షిత్ 91 సంవత్సరాల వయసులో స్వర్గస్తులయ్యారు. అయితే ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు కానీ ఈరోజు ముంబైలో ఆమె అంతక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. అయితే మరి కొంతమంది అయితే వయోభారరీత్యా ఆమె మరణించి ఉంటారు అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పూర్తి కారణాలు బయటకు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
మరొకవైపు తల్లిని కోల్పోయిన మాధురి దీక్షిత్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆదివారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారట.  వయోభారం కారణంగానే ఆమె మరణించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.  నేడు మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు కుటుంబ సభ్యులు.. ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య.. వారిని చూస్తూ స్వర్గానికి పయనం అయ్యింది అంటూ తన తల్లి మరణం మీద మాధురి దీక్షిత్ పోస్ట్ చేయడం ఇప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది.  తన తల్లి బర్తడే సందర్భంగా మాధురి దీక్షిత్ ఈ విధంగా పోస్ట్ చేశారు.
"హ్యాపీ బర్తడే అమ్మ.. కూతురికి అమ్మే మంచి ఫ్రెండ్ అని అంటుంటారు కదా .. అది నిజమే.. నువ్వు నాకోసం చేసినవన్నీ.. నాకు నేర్పిన బుద్ధులన్నీ.. కూడా నాకు మంచి బహుమతులు.. నువ్వు ఎప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అంటూ మాధురి దీక్షిత్  చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారుతుంది.. మాధురి తో ఒక పాట పాడించాలని మేకర్లు అనుకున్నప్పుడు రికార్డింగ్ థియేటర్కు తన అమ్మని కూడా తీసుకొచ్చిందట మాధురి దీక్షిత్ .. అక్కడే ఆమె తల్లి మంచి సింగర్ అని.. ఆమె గొంతు బాగుందని ఆ పాటను ఆమె చేతే పాడించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: