హీరోయిన్లను మించిన అందంతో గౌతమి కూతురు..!!

Divya
సీనియర్ హీరోయిన్ గౌతమి 1980, 90 సంవత్సరంలో తన హవా బాగా కొనసాగించింది. ముఖ్యంగా తెలుగు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించి స్టార్ హీరోయిన్గా రాణించింది. స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత మాత్రం సినిమాలలో నటించలేదు. 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకున్నది. ఏడాదిలో వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. ఈమెకు సుబ్బలక్ష్మి అని పేరు కూడా పెట్టారు కానీ ఆ ఒక్క ఏడాదిలోని వీరు విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. ఇక అప్పటినుంచి తన కూతురిని తనే పెంచుకుంటూ ఉంటు ఉంటోంది.
ప్రస్తుతం గౌతమి కూతురు వయసు 24 సంవత్సరాలు దీంతో అందంలో అమ్మకి కాంపిటీషన్ ఇవ్వడమే కాకుండా హీరోయిన్లను మించిపోయి కనిపిస్తోంది. ప్రస్తుతం సుబ్బలక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
సుబ్బలక్ష్మి ప్రస్తుతం తన తల్లి వద్దనే ఉంటోంది చదువులు చదివిన సుబ్బలక్ష్మి సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే కనిపిస్తోంది తన ఫోటోలను నిత్యం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వైరల్ గా మారుతోంది.
ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలలో సైతం ఆకర్షణీయమైన అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. చాలామంది హీరోయిన్ల కంటే ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తోంది. గ్లామర్ షో చేయకపోయినా అంతటి గ్లామర్ గా కనిపించడం విశేషమని చెప్పవచ్చు.
 సుబ్బలక్ష్మి ఫోటోలపై పలువురు నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరి కొంతమంది అయితే హీరోయిన్లతో పోడుస్తూ ఆమె అందాన్ని పొగిడేస్తూ ఉన్నారు. సుబ్బలక్ష్మి తన తల్లి గౌతమితో దిగినటువంటి కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. గౌతమి కూడా తన కూతురిని హీరోయిన్గా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలియజేస్తోంది. వాస్తవానికి ఈ విషయం గడిచిన మూడు ఏళ్ల క్రితమే వినిపించింది. కానీ ఇప్పటివరకు తెరపైకి మాత్రం తీసుకురాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: