అందుకే జబర్దస్త్ వదిలేసాను.. క్లారిటీ ఇచ్చిన వేణు?
దీనికంతటికి కారణం వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమానే. బలమైన కథాంశంతో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం ఇక ఇప్పుడు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో సక్సెస్ అయింది. అంతేకాదు నిర్మాత దిల్ రాజుకు భారీగానే లాభాలను తెచ్చిపెడుతుంది అని చెప్పాలి. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇక కమెడియన్ వేణు లో ఉన్న టాలెంట్ ని ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేసింది అని చెప్పాలి. బలగం సినిమా సూపర్ హిట్ కావడంతో నిర్మాత దిల్ రాజు వేణు కి మరో అవకాశం ఇచ్చారంటూ సమాచారం.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ ఇంటర్వ్యూలో చూసినా కూడా వేణునే కనిపిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను జబర్దస్త్ మానేయడానికి గల కారణాలు ఏంటో చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ తనకు పేరు ప్రఖ్యాతలు డబ్బును తెచ్చిపెట్టింది. తనను మంచి స్థాయికి తీసుకువచ్చింది. అయితే జబర్దస్త్ నుంచి నేను తప్పుకోవడానికి మల్లెమాల వారితో ఉన్న మనస్పర్ధలు కారణమని వార్తలు వచ్చాయి. కానీ అదంతా నిజం కాదు. తనకు సినిమాలలో కొనసాగడం అనేది కల. ఇక సినిమా పిచ్చితోనే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసాను. సినిమా అవకాశాల కోసం వెతకడంలో బిజీ అయి ఇక చివరికి జబర్దస్త్ ని వదిలేసాను అంటూ వేణు క్లారిటీ ఇచ్చాడు.