డైరెక్షన్ కి గుడ్ బై చెప్పనున్న పూరీ జగన్నాథ్..!

Divya
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఎంతోమంది హీరోలకు మంచి జీవితాన్ని ప్రసాదించిన ఈయన గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు.. అసలు విషయంలోకి వెళితే స్టార్ డైరెక్టర్గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా తీసినా సరే అట్టర్ ప్లాప్ గా నిలుస్తూ ఆయన గుర్తింపును పాడు చేస్తోంది.
ఈ క్రమంలోని చివరిగా ఆయన నటించిన లైగర్ సినిమా కూడా పూరీ జగన్నాథ్ కు ఏ స్థాయిలో నష్టాలు తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే. మొదటి నుంచి సినిమాపై ఓవర్ హైప్ ఉండడంతో సినిమా కాస్త బొక్క బోర్ల పడింది. అటు నిర్మాతగా వ్యవహరించిన చార్మికి కూడా ఆర్థిక కష్టాలు తప్పలేదు. ఈ సినిమాలో నటించిన అనన్య పాండే, విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలాగే ఉండిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూరీ జగన్నాథ్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో స్టార్ హీరోలు కూడా పూరీ జగన్నాథ్ కి అవకాశాలు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు.
దీంతో ఏం చేయాలో తెలియక డైరెక్షనే వద్దు సినిమాల్లో ఏదైనా చిన్న చితక రోల్స్ చేసుకొని సెటిల్ అయిపోదామని ఆలోచిస్తున్నారట పూరీ జగన్నాథ్. ఈ క్రమంలోనే చివరిగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు అలాంటి పాత్రల కోసమే వెతుకులాట మొదలుపెట్టారని తెలుస్తోంది. ఒకవేళ  అందుకు తగ్గట్టుగా మంచి పాత్ర దొరికితే డైరెక్షన్ కి గుడ్ బాయ్ చెప్పేసి టోటల్గా నటుడిగానే మారబోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: